Wednesday, March 4, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలపెన్షనర్ భవన్ లో ఉచిత కంటి శిభిరం

పెన్షనర్ భవన్ లో ఉచిత కంటి శిభిరం

📰 Generate e-Paper Clip

150 మందికి పరీక్షలు నిర్వహణ

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘంలో సోమవారం ఉచిత కంటి వైద్య శిభిరం నిర్వహించారు. మెడివిజన్ ఐ కేర్ సెంటర్ వైద్యులు దాదాపు 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో తక్షణమే కంటి పరీక్షలు అవసరమైన 37 మందికి వరంగల్ లో చికిత్స లు అందిస్తామని మెడికేర్ వైద్యులు పేర్కొన్నారు. డా. దీప్ సింగ్, ప్రవీణ్, సతీష్, రాజు, ఇమ్రాన్ ఈ శిబిరంలో పాల్గొన్న వారికీ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికీ మందులు అందించారు. టి. ఎస్. జి. ఆర్. ఈ. ఏ జగిత్యాల అర్బన్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిభిరంలో జిల్లా అధ్యక్షులు రవీందర్, కార్యదర్శి కొలిచాల రవీందర్, కోశాధికారి గుండేటి గంగాధర్, సభ్యులు పాల్గొన్నారు. అలాగే అర్బన్ యూనిట్ అధ్యక్షులు మెట్ట మల్లి ఖార్జున్, కార్యదర్శి కంటే అంజయ్య, కోశాధికారి వేల్పుల ప్రతాప్, బాల మురళి కృష్ణ, గుండేటి రవీందర్, చిన్న రాజయ్య, శారద, ప్రభాకర్ రావు, విఠలయ్య తోపాటు పలువురు ఉన్నారు.
_

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular