నవగీతం, మల్లాపూర్:
గతంలో విద్యబుద్దులు చెప్పిన పేదింటి విద్యార్ధినికి వివాహం అని తెలుసుకొని పుస్తె మట్టెలు అందజేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.మెట్ పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల లేక్చరర్ సిరిపురం మహేష్ సుప్రజ దంపతులు వివరాల్లోకి వెళ్తే మల్లాపూర్ మండలం సాతారం గ్రామానికి చెందిన నిరుపేద యువతి సైదు మేఘన వివాహం సందర్భంగా వారికి మెట్ పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల లేక్చరర్ సిరిపురం మహేష్ సుప్రజ దంపతులు పుస్తె మట్టెలు అందజేశారు. వారితో మన నేస్తం స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు బొడ్డు రాజేష్, ఉడ్గుల గంగాధర్, బడే రాజశేఖర్, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు చంద్రప్రకాష్, శేషగిరి గ్రామస్థులు పాల్గొన్నారు. తను గతంలో విద్యబుద్దులు చెప్పిన విద్యార్ధికి వివాహం అని తెలుసుకొని పుస్తె మట్టెలు అందించిన సిరిపురం మహేష్ సుప్రజా దంపతులను గ్రామస్థులు అభినందించారు

