Sunday, March 1, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలమల్యాల ఖండలో ఆర్ఎస్ఎస్ సాంఘిక శాఖ నిర్వహణ

మల్యాల ఖండలో ఆర్ఎస్ఎస్ సాంఘిక శాఖ నిర్వహణ

📰 Generate e-Paper Clip

నవగీతం, కొడిమ్యాల

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సాంఘిక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం మల్యాల ఖండలో సాంఘిక శాఖ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెగడపల్లి, మల్యాల, కొడిమ్యాల గ్రామాల స్వయంసేవకులు పాల్గొన్నారు. మల్యాల కేంద్రంగా నిర్వహించిన ఈ సాంఘిక శాఖలో దేశభక్తి గీతాలు, వ్యాయామాలు, సంఘ ప్రేరణాత్మక కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామాల మధ్య సౌహార్దం, సేవా భావం పెంపొందించుకోవడం ముఖ్య లక్ష్యంగా కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.ప్రత్యేకంగా కొడిమ్యాల గ్రామం నుండి 14 మంది స్వయంసేవకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పాల్గొన్న స్వయం సేవకులు సామాజిక చైతన్యం, క్రమశిక్షణ మరియు సేవా స్పూర్తి పెంపొందించుకోవడంలో ఈ కార్యక్రమాలు ఉపయుక్తమని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో సాంఘిక ఐక్యత మరింత బలపడుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular