Sunday, March 1, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలమహిళా పోలీస్ సిబ్బందికి ఉచిత హెల్త్ క్యాంపు

మహిళా పోలీస్ సిబ్బందికి ఉచిత హెల్త్ క్యాంపు

📰 Generate e-Paper Clip

క్యాన్సర్ వ్యాక్సినేషన్ పై అవగాహన సదస్సు

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

మహిళలలో వచ్చే రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్‌ను ముందస్తుగా ఏవిదంగా గుర్తించడం ఈ యొక్క క్యాన్సర్‌ లు రావడానికి గల కారణాలు, క్యాన్సర్ బారిన పడకుండా ముందస్తుగా తీసుకోవలసిన హెచ్ పి వి వ్యాక్సినేషన్ గురించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల వారి సహకారంతో ఆదివారం స్థానిక ఐ యం ఏ హాల్ లో జిల్లాలో మహిళా పోలీస్ సిబ్బందికి అవగాహన సదస్సు, హెల్త్ క్యాంప్ ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పి అశోక్ కుమార్ మాట్లాడుతూ.. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం, తద్వారా సమాజం ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. మహిళలు తమ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ యొక్క సర్వికల్ క్యాన్సర్ ద్వారా ప్రతి ప్రతి సంవత్సరం వేలాది మంది మహిళలు చనిపోవడం జరుగుతుందని కావున క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తిస్తే ప్రాణాపాయం ముప్పు తగ్గించవచ్చని, అందువల్ల మహిళలు స్వీయ పరీక్ష చేసుకోవాలని తెలిపారు. అనుమానం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.

తోటి మహిళలకు కూడా క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. పోలీస్ సిబ్బంది ఉద్యోగ విధుల్లో నిమగ్నమై ఉంటారని, వారి ఆరోగ్యాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య నిపుణులు మహిళల్లో ఎక్కువగా కనిపించే సర్వికల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రారంభ లక్షణాలు, నివారణ చర్యలు, సమయానికి పరీక్షలు చేయించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరంగా తెలియజేశారు. అలాగే, ప్రతి మహిళా సిబ్బంది సంవత్సరానికి కనీసం ఒకసారి పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్లు గూడూరి హేమంత్ , ప్రవీణ్ కుమార్, పద్మిని, శ్రీలత, రజిత, ఎస్.ఐ గీత,మహిళా సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular