Saturday, March 7, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలమాజీ ఎమ్మెల్యే దామన్న సేవలు చిరస్మరణీయం

మాజీ ఎమ్మెల్యే దామన్న సేవలు చిరస్మరణీయం

📰 Generate e-Paper Clip

నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రఘు

నవగీతం, మెట్ పల్లి టౌన్:

మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే తుమ్మల వెంకట రమణ రెడ్డి (దాము) ప్రజాక్షేత్రంలో అందించిన సేవలు చిరస్మరణీయమని నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రఘు పేర్కొన్నారు. శనివారం మాజీ ఎమ్మెల్యే తుమ్మల వెంకట రమణ రెడ్డి జయంతి సందర్భంగా పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రఘు మాట్లాడుతూ మెట్ పల్లి ఎమ్మెల్యేగా దాము ఎనలేని సేవలను అందించారని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రేండ్ల రాజన్న, గడ్డం శివారెడ్డి, గడ్డం రాజారెడ్డి, కొండ్లేపు శ్రీనివాస్, వేముల రవి, తోకల సత్యనారాయణ, అశోక్, న్యాయవాది మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular