Sunday, March 1, 2026
ads
Homeతెలంగాణపెద్దపల్లియువతకు ఉపాధి మహిళలకు ఆర్థిక స్వాలంబనే లక్ష్యం

యువతకు ఉపాధి మహిళలకు ఆర్థిక స్వాలంబనే లక్ష్యం

📰 Generate e-Paper Clip

-బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ దాసరి ఉష

రాజయ్య ఎడ్యుకేషనల్ సొసైటీ అండ్ ఫిట్ అండ్ ఫ్యూచర్ క్లబ్ ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్

నవగీతం, పెద్దపల్లి:

నియోజకవర్గంలోని యువతకు మరియు మహిళలకు ఆర్థిక స్వాలంబన కల్పించడమే ధ్యేయంగా అడుగులు వేయాలని బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ దాసరి ఉష పిలుపునిచ్చారు.జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో రీసెట్ సంస్థకు చెందిన ప్రీతి,ఉదయ్ తమ తండ్రి పీఈటి రాజయ్య గౌరవార్థం నూతనంగా నెలకొల్పిన రాజయ్య ఎడ్యుకేషనల్ సొసైటీ ఫర్ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్‌ అండ్ ఫిట్ అండ్ ఫ్యూచర్ క్లబ్ ను ఆదివారం పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య,బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ దాసరి ఉష,ఫిట్ అండ్ ఫ్యూచర్ క్లబ్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ మల్లయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు డిఫెన్స్, బ్యాంకింగ్,రైల్వే రిక్రూట్‌మెంట్ వంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు ఇటువంటి సంస్థలు ఎంతో దోహదపడతాయని,నిర్వాహకుల కృషిని అభినందించారు. అనంతరం బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ దాసరి ఉష మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా నియోజకవర్గంలోని ప్రతి ఇంటిని సందర్శించి క్షేత్రస్థాయి సమస్యలను తెలుసుకున్నానని పేర్కొన్నారు.పెద్దపల్లిలో నిజమైన మార్పు రావాలంటే మహిళలకు ఉపాధి కల్పించడం మరియు యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం అత్యంత కీలకమని ఆమె స్పష్టం చేశారు.

కేవలం ప్రభుత్వాలపైనే ఆధారపడకుండా, యువతలో కూడా ఒక తపన, యూనిటీ ఉండాలని ఆమె ఆకాంక్షించారు. గతంలో తాము చేపట్టిన డేటా సైన్స్ ప్రోగ్రామ్ ద్వారా సాధించిన విజయాలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక నిపుణులను పిలిపించి శిక్షణ ఇవ్వడం ద్వారా,నెలకు 500 ట్యూషన్లు చెప్పుకునే ఒక సాధారణ ముస్లిం విద్యార్థిని నేడు ఏడాదికి రూ.5 లక్షల ప్యాకేజీ పొందే స్థాయికి ఎదిగిందని ఆమె వివరించారు.శిక్షణ పొందిన 120 మంది విద్యార్థులు నేడు ఎంఎన్‌సి కంపెనీలలో ఐటీ ఉద్యోగాలు సాధించడం గర్వకారణమని అన్నారు. యువత అవసరాలను బట్టి మూడు విభాగాల్లో శిక్షణ అందించాల్సిన అవసరం ఉందని ఆమె గుర్తించారు.ప్రభుత్వ ఉద్యోగాలు,ఐటీ రంగాలు, మరియు నాన్-ఐటీ,వ్యాపార రంగాలలో శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని వివరించారు. పెద్దపల్లిలోనే నిరంతరం ఇటువంటి శిక్షణలు అందేలా వివిధ ఎన్జీవోలు మరియు కంపెనీ సీఈఓలతో చర్చిస్తున్నామని, యువతను బిజినెస్ ఓనర్లుగా మార్చడమే తమ లక్ష్యమని ఉష వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఫిట్ అండ్ ఫ్యూచర్ అధ్యక్షుడు మచ్చా రాహుల్, ఉపాధ్యక్షుడు కల్వల చరణ్,స్వచ్ఛంద సంస్థ రక్షణ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధి సుజిత,ది లైబ్రరీ కంపెనీ సీఈఓ చంద్ర,సుల్తానాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్-ఇన్స్పెక్టర్ చిరంజీవి,ఆర్ఏఫ్ సీఏల్ హెచ్.ఆర్.సోమనాథ్,డాక్టర్ సురేందర్,మున్సిపల్ కైన్సిలర్ కమల్,తోట ప్రణీత భూపతి,డేటా సైన్స్ పూర్వ విద్యార్థి రవికిరణ్,బీసీ జేఏసీ నాయకులు, యువకులు,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular