Monday, March 2, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలసమస్యల పై సమగ్ర విచారణ చేపట్టి పరిష్కారానికి చొరవ చూపాలి.

సమస్యల పై సమగ్ర విచారణ చేపట్టి పరిష్కారానికి చొరవ చూపాలి.

📰 Generate e-Paper Clip

కలెక్టర్ బి.సత్య ప్రసాద్

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్, ఆర్డీఓలతో కలిసి కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ పలు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు మండలాల నుండి ప్రజలు సమస్యలు విన్నవించుకోడానికి ప్రజావాణికి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పై సమగ్ర విచారణ చేపట్టి పరిష్కారానికి చొరవ చూపాలని అన్నారు.

అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 62 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని  సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular