Thursday, April 30, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలనారీ శక్తి వందన్ అధినియం పై కోరుట్లలో మహిళా అక్రోష సమ్మేళనం

నారీ శక్తి వందన్ అధినియం పై కోరుట్లలో మహిళా అక్రోష సమ్మేళనం

📰 Generate e-Paper Clip

మహిళలకు 33శాతం రిజర్వేషన్ అడ్డుకున్న పార్టీలకు గుణపాఠం

నవగీతం,కోరుట్ల ప్రతినిధి:

కోరుట్ల పట్టణంలోని కటుకం సంగయ్య ఫంక్షన్ హాల్లో జరిగే మహిళా రిజర్వేషన్ బిల్లు నారీ శక్తి వందన్ అధినియం పై కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న రాజకీయాలకు నిరసనగా, ఈ నెల 30 న గురువారం కోరుట్ల పట్టణంలోని కటుకం సంగయ్య ఫంక్షన్ హాల్‌లో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో “మహిళా అక్రోష సమ్మేళనం” నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు తెలిపారు.ఈ సమావేశానికి మాజీ శాసన సభ్యురాలు డా. శ్రీదేవి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. జగిత్యాల అసెంబ్లీ ఇంచార్జి భోగ శ్రావణి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా. అనూప్ రావు,  రాష్ట్ర కార్యావర్గ సభ్యురాలు పుదరి అరుణ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొననున్నారు. మహిళలకు 33% రిజర్వేషన్ విషయంలో దశాబ్దాలుగా ఆలస్యం చేసి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురాగానే అడ్డంకులు సృష్టిస్తున్న పార్టీల ద్వంద్వ వైఖరిని ప్రజలకు తెలియజేయడం, అలాగే మహిళలకు న్యాయం చేయడాన్ని వ్యతిరేకించిన పార్టీలకు గుణపాఠం చెప్పడమే ఈ సమ్మేళనం ముఖ్య ఉద్దేశమని బీజేపీ నేతలు తెలిపారు.జిల్లాలోని మహిళా మోర్చా నాయకురాళ్లు, కార్యకర్తలు, వివిధ రంగాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular