Thursday, May 7, 2026
ads
Homeఖమ్మంరైతు వేదికలో జోరుగా రైతు వారోత్సవాలు

రైతు వేదికలో జోరుగా రైతు వారోత్సవాలు

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్యే కూనంనేనితో టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు

నవగీతం ,కొత్తగూడెం

ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కొత్తగూడెంలోని రైతు వేదికలో సోమవారం రైతు వారోత్సవ కార్యక్రమాలు నిర్వహించగా స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు ప్రభుత్వం రెవెన్యూ గ్రామానికి ఒక సాయిల్ వాలెంటర్లను నియమించిందని వీరి ద్వారా గ్రామంలోని రైతుల పొలాల్లో భూసార పరీక్షలు నిర్వహించి తద్వారా వచ్చిన భూసార పరీక్ష కార్డు ద్వారా పోషక లోపాలను గుర్తించి నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.ముఖ్యంగా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ మరియు జీవన ఎరువుల వైపు రైతులు ఆలోచించాలని, సహజసిద్ధమైన వ్యవసాయం ద్వారా పెట్టుబడి తగ్గడంతో పాటు రైతులకు లాభదాయకంగా ఉంటుందని చెప్పారు. సరైన పద్ధతిలో సరైన మోతాదులో సరైన సమయంలో ఎరువులు యాజమాన్యం పాటిస్తే చాలావరకు తెగుళ్లు మరియు పురుగుల బెడద ఉండదని వివరించారు. రైతు సోదరులందరూ ఎరువుల నియంత్రణ పాటిస్తూ ప్రకృతి వ్యవసాయం దిశగా అడుగులు వేయాలని, ఇది మానవాళి మనుగడకు ఎంతో అవసరమని చెప్పారు. అవసరానికి మించి ఒకే విడతలో ఎరువుల వాడకము చేయకూడదని, విడతల వారీగా వాడడం వల్ల మొక్కలు సమతుల్యంగా పెరుగుతాయని తెలిపారు.రైతులందరూ సమగ్ర ఎరువుల యాజమాన్యం, పోషకాల సమతుల్యత, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించి సరైన యాజమాన్యం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు , ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ మూడ్ గణేష్, డిప్యూటీ మేయర్ లలిత కుమారి, మాజీ సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంత్ రావు, విద్యానగర్ ఉప సర్పంచ్ వాసిరెడ్డి మురళి మరియు వివిధ శాఖలఅధికారులు,సైంటిస్టులు ,ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular