పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ ,వైస్ చైర్మన్
నవగీతం,వైరా ప్రతినిధి:
వైరా మున్సిపాలిటీ పరిధిలోని శిరిడి సాయి మందిరం సాయి నగర్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ సాయి మందిరం 31 వ వార్షికోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వైరా మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ ,వైస్ చైర్మన్ కట్ల సంతోష్ పాల్గొన్నారు, ఈ సందర్భంగా మందిర కమిటీ వారిని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన మహా అన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా షిరిడి సాయి మందిరం వార్షికోత్సవం కన్నుల పండగ జరుగుతూ వస్తూ ఉంది. గత 31 సంవత్సరాలుగా షిరిడి సాయి మందిరం వార్షికోత్సవ కార్యక్రమానికి వైరా కూరగాయల మార్కెట్ నిర్వాహకులు, వ్యాపార కిరాణా షాపులు ప్రతి అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ వస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు చైర్మన్ పొడపాటి నాగేశ్వరరావు , కోశాధికారి లగడపాటి బోసు , మాదినేని దుర్గాప్రసాద్ , నల్లమోతు వెంకటయ్య , మిద్దె చిన్న సుబ్బారావు, తల్లపు రెడ్డి కృష్ణారెడ్డి, డాక్టర్ కాపా మురళీకృష్ణా , 12వ వార్డు కౌన్సిలర్ మాదినేని సునీత తదితరులు పాల్గొన్నారు

