Thursday, May 7, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలకోరుట్ల పట్టణంలో గాలివానకు విరిగిపడిన చెట్టు

కోరుట్ల పట్టణంలో గాలివానకు విరిగిపడిన చెట్టు

📰 Generate e-Paper Clip

తక్షణమే స్పందించిన కౌన్సిలర్ ఇందూరి తిరుమలవాసు

నవగీతం, కోరుట్ల ప్రతినిధి :

కోరుట్ల పట్టణంలో ఒక్కసారిగా గురువారం సాయంత్రం కురిసిన గాలివానకు 27వ వార్డులో పెను ప్రమాదం తప్పింది. వార్డులోని మాజీ కౌన్సిలర్ వజ్రక్క నివాసంపై వృక్షం విరిగిపడటంతో ఇంటి పైకప్పు కొంతమేర దెబ్బతిన్న విషయం తెలియగానే 27వ వార్డు కౌన్సిలర్ ఇందూరి తిరుమలవాసు తక్షణమే స్పందించి స్వయంగా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం ఆయన మున్సిపల్ అధికారులతో మాట్లాడి సిబ్బందిని రంగంలోకి దించి, వారి సహాయంతో ఇంటిపై పడిన వృక్షాన్ని తొలగింపజేశారు.ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు అండగా ఉండటం మన బాధ్యత అని, సమాచారం అందిన వెంటనే మున్సిపల్ సిబ్బంది స్పందించి చెట్టును తొలగించడం జరిగిందని పేర్కొంటూ వేగమైన గాలులతో కూడిన వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిరుమలవాసు సూచించారు. ఈ సహాయక చర్యల్లో మున్సిపల్ సిబ్బంది మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular