Saturday, May 30, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం

ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి:

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామంలో మహా ఫౌండేషన్ చైర్మన్ తనుగుల మధు ఆధ్వర్యంలో పదవ తరగతి పరీక్షలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు మర్రిపెల్లి మైథిలి, గంగాధరి హన్సిక, పల్లికొండ రేచల్ లకు శాలువా తో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ మధు మాట్లాడుతూ.. పదవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించి గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చారని మునుముందు ఇంకా ఉన్నతంగా చదువులు చదివి మంచి ఉద్యోగాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రామ  రామలింగేశ్వర త్రికుటలయ కమిటీ చైర్మన్, బీజేవైఎం మండల అధ్యక్షులు పందిరి నాగరాజు ఆయనతో పాటు తోట ప్రశాంత్, హరీష్, అరవింద్ మరియు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular