Saturday, May 30, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలబీజేపీ నేతల ముందస్తు అరెస్టులు

బీజేపీ నేతల ముందస్తు అరెస్టులు

📰 Generate e-Paper Clip

నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి:

జగిత్యాల జిల్లా కేంద్రంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నవోదయ పాఠశాల, కేంద్రీయ విద్యాలయాల నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని ఇందూర్ పార్లమెంట్ సభ్యుడు పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లినా స్పందన లేకపోవడంతో ధర్మ దీక్షకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ దీక్షకు జగిత్యాల జిల్లా ఎస్పీ అనుమతి నిరాకరించిన నేపథ్యంలో, నిరసనగా జగిత్యాల ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు మల్లాపూర్ మండలం నుంచి బయలుదేరిన బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుల్లో వేంపెల్లి సర్పంచ్ రాజేందర్, బీజేవైఎం మండల అధ్యక్షుడు పందిరి నాగరాజు, మండల బీజేపీ ఉపాధ్యక్షుడు లవంగం శివ, మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గజ్జి శ్రీనివాస్, సీనియర్ నాయకులు ముద్ధం సత్యనారాయణ, ఉట్నూరి చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. ఈ ముందస్తు అరెస్టులను మల్లాపూర్ బీజేపీ మండల శాఖ తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ శాంతియుత నిరసనలకు కూడా అనుమతి ఇవ్వకపోవడం దురదృష్టకరమని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular