Friday, September 4, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

ఇబ్రహీంపట్నం,ఆగస్టు 19 (నవగీతం): ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇబ్రహీంపట్నం మండలంలో ఫోటోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు కేక్ కట్ చేసి,జెండా ఆవిష్కరించి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు.అనంతరం ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగెర్  చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఫోటోగ్రఫీ రంగం అభివృద్ధికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా సభ్యులు స్మరించుకున్నారు. అనంతరం స్థానిక ఇబ్రహీంపట్నం ఎస్సై జి నవీన్ కుమార్ ను ఫోటోగ్రఫీ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఫోటోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, ఫోటోగ్రాఫర్లు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular