Friday, September 4, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలచిట్టాపూర్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

చిట్టాపూర్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

📰 Generate e-Paper Clip

మల్లాపూర్,ఆగస్టు24,(నవగీతం):మల్లాపూర్ మండలలోని చిట్టాపూర్ గ్రామంలో సోమవారం నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఉప సర్పంచ్ బాల్సని ప్రణయ్ గౌడ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సులభంగా, పారదర్శకంగా అందించేందుకు స్మార్ట్ రేషన్ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జీపీఓ రాజేష్ రేషన్ డీలర్ బొల్లపెల్లి శ్రీనివాస్, వార్డు సభ్యులు రామగిరి సంజీవ్, నారాయణ, మణికాంత్, లక్ష్మీ, లత అనూష, గంగమణి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular