మల్లాపూర్,ఆగస్టు29,(నవగీతం):మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలో నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (పల్లె దవాఖాన)ను త్వరితగతిన ప్రారంభించి గ్రామస్తులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని మననేస్తాం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు బొడ్డు రాజేష్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత ప్రభుత్వ హయాంలో సాతారం గ్రామ మాజీ సర్పంచ్ బొడ్డు సుమలత కృషితో, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుసహకారంతో సుమారు రూ.20 లక్షల అంచనా వ్యయంతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మంజూరు చేయించినట్లు తెలిపారు.ఆరోగ్య కేంద్రం నిర్మాణం పూర్తయినప్పటికీ ఇప్పటివరకు ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి ఆరోగ్య కేంద్రాన్ని త్వరగా ప్రారంభించాలని కోరారు.గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని బొడ్డు రాజేష్ కోరారు.
పల్లె దవాఖానను త్వరగా ప్రారంభించాలి
0
22
Previous article
Next article

