Tuesday, November 3, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలకోరుట్ల మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉషాకోలా పరమేశ్వర్

కోరుట్ల మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉషాకోలా పరమేశ్వర్

📰 Generate e-Paper Clip

కోరుట్ల,అక్టోబర్08,(నవగీతం)

కోరుట్ల మండలం గుమ్లాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉషాకోలా పరమేశ్వర్ కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆయన నియామక పత్రాన్ని రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్, నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు, రాష్ట్ర సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, జగిత్యాల జిల్లా డీసీసీ అధ్యక్షులు గాజంగి నందయ్యల చేతుల మీదుగా పరమేశ్వర్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నిరంతరం శ్రమించాలని సూచించారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన నాయకులకు ఉషాకోలా పరమేశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పన్నాల అంజిరెడ్డి, బీసీ సెల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డ వెంకటేష్ గౌడ్ సహా పలువురు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular