Friday, February 27, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలజేఎన్టీయూలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్

జేఎన్టీయూలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్

📰 Generate e-Paper Clip

10 మందికి విద్యార్థులకు సాఫ్ట్వేర్ జాబ్

నవగీతం,కోడీమ్యాల

జగిత్యాల జిల్లా కొండగట్టు జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ బి.టెక్ విద్యార్థుల కోసం 10000 కోడర్స్ ఆధ్వర్యంలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. జి. నరసింహ తెలిపారు.ఈ సందర్భంగా 10000 కోడర్స్ సంస్థ హెచ్ ఆర్ ప్రతినిధి పి. అరవింద్‌తో పాటు ఫుల్ స్టాక్ డెవలపర్లు సాయి మహేంద్ర, సాయి కన్నా విద్యార్థులకు కంపెనీ విధి విధానాలు, శిక్షణ విధానం ఉద్యోగ అవకాశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం రెండు దశల ఎంపిక ప్రక్రియను నిర్వహించారు.మొదటి దశగా నిర్వహించిన గ్రూప్ డిస్కషన్‌లో 41 మంది విద్యార్థులు అర్హత సాధించగా, రెండవ దశగా జరిగిన ముఖాముఖి ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఈ ఎంపిక ప్రక్రియలో ప్రతిభ చూపిన 10 మంది విద్యార్థులను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టులకు ఎంపిక చేసినట్లు కళాశాల యాజమాన్యం తెలిపారు. విద్యార్థులకు వార్షిక వేతనం రూ.4 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు ఉంటుందని ట్రైనింగ్ ప్లేస్‌మెంట్ అధికారి డా. బి. సతీష్ కుమార్ తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని ప్రముఖ సంస్థలతో క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లను నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ డా. జి. నరసింహ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా. కె. శ్రీనివాస్, ట్రైనింగ్. ప్లేస్‌మెంట్ అధికారి, శాఖల కోఆర్డినేటర్లు, ప్లేస్‌మెంట్ విభాగ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular