నవగీతం, మల్లాపూర్
తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు జక్కని పరంధాములు ఆదేశాల మేరకు, మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామానికి చెందిన ఇప్ప గంగాధర్ ను మల్లాపూర్ మండల వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షులుగా నియమించారు. ఈ నియామక ఉత్తర్వులను నియోజకవర్గ వార్డు మెంబర్ల పోరం అధ్యక్షురాలు జల హనుమండ్లు జారీ చేశారు. సిరిపూర్ సర్పంచ్ పెంట సౌజన్య శ్రీనివాస్, ఉప సర్పంచ్ నాగార్జున, మాజీ సర్పంచ్ బాపురెడ్డిలు ఇప్ప గంగాధర్ కు శాలువా కప్పి సన్మానించి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ మాధవరెడ్డి, నాయకులు పోగుల నారాయణ తదితరులు పాల్గొన్నారు.

