కలెక్టర్ బి సత్య ప్రసాద్
నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బంది రెండవ రాండమైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి బి. సత్యప్రసాద్ బుధవారం జనరల్ అబ్జర్వర్ ఖర్టాడే కాళీచరణ్ సుదామా రావు తో కలిసి రెండవ రాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు.ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగాలనే ఉద్దేశంతో ఈ రాండమైజేషన్ చేపట్టినట్లుగా జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలను ఎలాంటి లోపాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.రాజ గౌడ్, జిల్లా నోడల్ అధికారి కె. రాము, కలెక్టరేట్ ఏవో హకిమ్, ఈడిఏం మమత మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

