Thursday, February 26, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలబీజేపీ అంటేనే అభివృద్ధి...

బీజేపీ అంటేనే అభివృద్ధి…

📰 Generate e-Paper Clip

– మెట్ పల్లిలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా డాక్టర్ రఘు ప్రచారం

నవగీతం,మెట్ పల్లి:

బీజేపీ అంటేనే అభివృద్ధి… సంక్షేమం అంటేనే బీజేపీ అని బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గురువారం మెట్ పల్లి పట్టణంలోని 15వ వార్డులో అరిగెల అనూష రాకేష్, 18వ వార్డులో చెట్లపల్లి మీనా – సుఖేందర్ గౌడ్, 26వ వార్డులో బొడ్ల రమేష్ లకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఓటర్లతో ఆప్యాయంగా మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అదే విధంగా ఇబ్రహీంపట్నం మండలం సత్తెక్కపల్లి గోశాలను డాక్టర్ రఘు సందర్శించారు. అక్కడ అవసరమైన వసతులను పరిశీలించారు. కాగా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన నాయకులు జలేందర్ రెడ్డి దంపతులకు ఇటీవల కుమార్తె జన్మించగా వారిని కలిసి డాక్టర్ రఘు శుభాకాంక్షలు తెలిపారు. వారి ఇంటికి మహాలక్ష్మి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆయన వెంట బీజేపీ జిల్లా కార్యదర్శి పీసు రాజేందర్ రెడ్డి, బీజేవైఎం నాయకులు ఇట్టేడి శేఖర్ రెడ్డి, బీజేవైఎం నాయకులు సుంకేట విజయ్, తదితరులు ఉన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular