నవగీతం,కొడిమ్యాల:
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిప్పాయపల్లి గ్రామంలో శనివారం ఎంపీడీవో స్వరూప ఇందిరమ్మ ఇళ్ల ను సమగ్రంగా పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ స్థితి, మౌలిక సదుపాయాలపై ఆమె కచ్చితమైన ఆరా తీశారు.పరిశీలనలో గ్రామ సర్పంచ్ ల్యాగాల రాజేశం, ఉప సర్పంచ్ సంగు అరవింద్ పాల్గొన్నారు. గ్రామంలోని కొంతమంది లబ్ధిదారుల బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.వీటిని త్వరగా మంజూరు చేసి చెల్లింపులు జరగేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో ని సర్పంచ్ రాజేశం కోరారు. ఎంపీడీఓ స్వరూప ఈ అంశంపై తక్షణ చర్యలు తీసుకుంటారని, గ్రామ అభివృద్ధికి అన్ని ప్రయత్నాలు కొనసాగుతాయని చెప్పారు.

