Saturday, March 14, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలజిల్లాలో ఎలాంటి గ్యాస్ కొరత లేదు

జిల్లాలో ఎలాంటి గ్యాస్ కొరత లేదు

📰 Generate e-Paper Clip

గ్యాస్ సరఫరాపై అపోహలు నమ్మవద్దు

సమీక్షా సమావేశంలో అధికారులు

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

కమీషనర్ పౌరసరఫరా శాఖ హైదరాబాద్ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయంలో అదనపు కలెక్టర్ జగిత్యాల, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జగిత్యాల అధ్యక్షతన గ్యాస్ ఏజెన్సీ యజమానులు, సేల్స్ ఆఫీసర్లు, జిల్లా తహసిల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలో ఎలాంటి గ్యాస్ కొరత లేదని తెలిపారు. జిల్లాలో గృహ వినియోగ (డొమెస్టిక్) వంటగ్యాస్ సిలిండర్లు సరిపడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో బుకింగ్ చేసిన తర్వాత 25 రోజుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల్లో డెలివరీ జరుగుతుందని వివరించారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ గ్యాస్ వ్యాపార సంస్థలు, గోదాముల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

జిల్లాలో గృహ వినియోగ వంటగ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేయడం లేదా తరలించడం జరగకుండా పర్యవేక్షణ పెంచుతామని తెలిపారు. అటువంటి అక్రమాలకు పాల్పడిన వారిపై ఈ సి యాక్ట్ ప్రకారం కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమీక్షా సమావేశంలో రెవెన్యూ అధికారులు, జిల్లా పౌరసరఫరాల అధికారి, పోలీసు సిబ్బంది, పౌరసరఫరాల క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular