Saturday, April 18, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలవిద్యుత్ అంతరాయాల నివారణకు ఈఆర్టీ వాహనాలు: ఎస్ఈ వెల్లడి

విద్యుత్ అంతరాయాల నివారణకు ఈఆర్టీ వాహనాలు: ఎస్ఈ వెల్లడి

📰 Generate e-Paper Clip

నవగీతం, జగిత్యాల:

ప్రకృతి విపత్తులైన భారీ వర్షాలు, ఈదురు గాలులు, సాంకేతిక కారణాల వల్ల విద్యుత్ సరఫరాలో ఏర్పడే అంతరాయాలను తగ్గించి వినియోగదారులకు త్వరితగతిన సేవలు అందించేందుకు జగిత్యాల సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ బి. సుదర్శనం ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ మేరకు సర్కిల్ పరిధిలో ERT , Emergency Restoration Team – (ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్) మూడు వాహనాలను, టీం ను కూడా వినియోగిస్తున్నామని వెల్లడించారు. అదేవిధంగా సబ్‌డివిజన్ స్థాయిలో 9 వాహనాలను సిద్ధంగా ఉంచి అత్యవసర పరిస్థితుల్లో వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. ఈ వాహనాల్లో విద్యుత్ లైన్ల మరమ్మత్తులకు అవసరమైన కండక్టర్లు, ఇన్సులేటర్లు, కేబుల్స్, టూల్స్ తదితర మెటీరియల్ ముందుగానే అందుబాటులో ఏర్పాటు చేసుకొని ,వాహనాలకు GPRS (Global Positioning / Tracking System) ఏర్పాటు చేయడంతో సమస్య ఏర్పడిన ప్రాంతానికి బృందాన్ని వెంటనే పంపించి వేగంగా సమస్యను పరిష్కరిస్తున్నామని ఎస్ ఈ వివరించారు.ఈ ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్ వాహనాల ద్వారా హఠాత్తుగా సంభవించే సమస్యలను పరిష్కరించడంలో ఎంతగానో దోహదపడుతూన్నాయని చెప్పారు. ఈఆర్టీ వాహనాల పై 1912 అని టోల్ ఫ్రీ నంబర్ ముద్రించి కూడా ఉంటుందని, ఎటువంటి సమస్యలకైనా 1912 నంబర్ లో సంప్రదిచాలి అని కోరారు , 24/7 ఈ టోల్ ఫ్రీ నంబర్ పనిచేస్తుందని వివరించారు .విద్యుత్ అంతరాయాలను తగ్గించి వినియోగదారులకు మెరుగైన నాణ్యమైన సేవలు అందించడంలో సంస్థ మరింత సమర్థవంతంగా పనిచేస్తోందని ఎస్ఈ వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular