Tuesday, August 4, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలజగిత్యాల లో బీజేపీ రాస్తారోకో

జగిత్యాల లో బీజేపీ రాస్తారోకో

📰 Generate e-Paper Clip

డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇందూరి తిరుమల వాసు అరెస్ట్

నవగీతం, కోరుట్ల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎంపీ ధర్మపురి అరవింద్ ధర్మాదీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని నిరసిస్తూ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక తహసిల్ చౌరస్తా వద్ద భారీ రాస్తారోకో నిర్వహించారు, ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నడుమ బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇందూరి తిరుమల వాసును పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తిరుమల వాసు మాట్లాడుతూ.. ఎంపీ ధర్మాదీక్షకు వెంటనే అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు, అలాగే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తన ప్రజా వ్యతిరేక చర్యలను వెంటనే మానుకోవాలని హెచ్చరించారు. జిల్లా అభివృద్ధిని అడ్డుకోకుండా, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయానికి తక్షణమే స్థలాన్ని కేటాయించాలని వారు ఈ సందర్భంగా గట్టిగా డిమాండ్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular