మల్లాపూర్, అక్టోబర్ 3 (నవగీతం):
గల్ఫ్ దేశమైన దోహా–కతార్‌లో గత నెల 24న మృతి చెందిన కోరుట్ల నియోజకవర్గం, మల్లాపూర్ మండలం నడికుడ గ్రామానికి చెందిన తలారి ముత్తన్న మృతదేహం శనివారం స్వగ్రామానికి చేరుకుంది. మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు.
ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు
నడికుడ గ్రామానికి చేరుకుని ముత్తన్న మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం నిర్వహించిన అంతిమయాత్రలో జువ్వాడి కృష్ణారావు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాట్ల సోమయ్య, జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు ఏలాల జలపతి రెడ్డి , స్థానిక మాజీ సర్పంచ్ ముద్దం రాజేందర్ రెడ్డి, ఎర్ర భూమయ్య,తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు, బంధువులు పాల్గొన్నారు.

