ఛాతీ, ఎడమ భుజంపై తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
మల్లాపూర్, అక్టోబర్ 26 (నవగీతం):
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామంలో నల్లా నీళ్ల విషయంలో జరిగిన గొడవ కత్తితో దాడికి దారితీసింది. ఈ ఘటనలో ద్యావల్ల గంగారాం తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం వాల్గొండ గ్రామంలో నల్లా నీళ్ల విషయంలో బోదాసు అజయ్‌కు, ఆయన తాత బోదాసు భీమయ్యకు మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో అజయ్‌ను ఆయన మేనత్త ద్యావల్ల లక్ష్మి, మామ ద్యావల్ల గంగారాం మందలించారు. దీంతో ఆగ్రహానికి గురైన అజయ్ కత్తితో ద్యావల్ల గంగారాంపై దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ దాడిలో గంగారాం ఛాతీ భాగంలో, ఎడమ భుజంపై, శరీరంలోని ఇతర భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం మెట్టుపల్లిలోని మైత్రి ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై ద్యావల్ల లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మల్లాపూర్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎ. అనిల్ తెలిపారు.


