మల్లాపూర్,ఆగస్టు8,(నవగీతం): కోరుట్ల నుంచి గుండంపల్లి, మల్లాపూర్ మీదుగా ఖానాపూర్ వరకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ గుండంపల్లి కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర వెల్మ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావును కలిసి వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా గుండంపల్లి–సాతారం నుంచి మల్లాపూర్ వరకు ఉన్న పంచాయతీరాజ్ రహదారిని ఆర్‌అండ్‌బీ రోడ్డుగా మార్చి, రహదారి అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ రెండు సమస్యలను పరిష్కరించడం ద్వారా ఆయా గ్రామాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని నాయకులు వివరించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా బస్సు సౌకర్యం కల్పించడంతో పాటు రహదారి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని జువ్వాడి నర్సింగరావును కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంతడుపుల పుష్పలత నర్సయ్య, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు ఎల్లాల జలపతి రెడ్డి, మల్లాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్ల సోమయ్య, బాపురెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బస్సు సౌకర్యం, రహదారి అభివృద్ధికి వినతి
0
3
Previous article

