Monday, August 3, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలమొగిలిపేట బీజేపీ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఏకగ్రీవ ఎన్నిక

మొగిలిపేట బీజేపీ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఏకగ్రీవ ఎన్నిక

📰 Generate e-Paper Clip

నవగీతం, మల్లాపూర్:

మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో భారతీయ జనతా పార్టీ గ్రామ శాఖ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ శాఖ నూతన అధ్యక్షుడిగా గోల్కొండ గంగారెడ్డి (బాపూజీ)ని, ఉపాధ్యక్షుడిగా పీట్ల సాయిరాం ను కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన గోల్కొండ గంగారెడ్డి (బాపూజీ), పీట్ల సాయిరాం పార్టీ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని గ్రామంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మొగిలిపేట గ్రామ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular