Tuesday, November 3, 2026
ads
Homeతెలంగాణములుగువెంకటాపురం పీఆర్టియూ అధ్యక్షుడుగా బోళ్ల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక.

వెంకటాపురం పీఆర్టియూ అధ్యక్షుడుగా బోళ్ల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక.

📰 Generate e-Paper Clip

నూగురు వెంకటాపురం, సెప్టెంబర్ 30,(నవగీతం):

వెంకటాపురం మండలకేంద్రంలో పీఆర్టీయూ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎంపికయ్యారు . మండల శాఖ అధ్యక్షుడిగా బొళ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కే.వీరన్న ఎన్నికయ్యారు.అసోసియేట్ అధ్యక్షులుగా ఎం.సత్యనారాయణ, బి.మాధవరావు, మహిళా అసోసియేట్ అధ్యక్షులుగా బి.విజయశ్రీ, జె.సుజాత, ఉపాధ్యక్షులుగా కే.విజయ్, ఏడుకొండలస్వామి, మహిళా ఉపాధ్యక్షులుగా టి.వెంకటరమణ, జె.కళ్యాణి, కార్యదర్శులుగా బి.రాజేశ్వరరావు, ఎల్.రమేష్, మహిళా కార్యదర్శిగా సీహెచ్.పల్లవిని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు  యాకూబ్ రెడ్డి ప్రధాన కార్యదర్శి శ్రీరంగం, మాజీ అధ్యక్షులు దేవులపల్లి సత్యనారాయణ, ఎన్నికల నిర్వహణాధికారి వెంకటేశ్వరు తదితరులు పాల్గొన్నారు .అనంతరం యాకూబ్ రెడ్డి మాట్లాడుతూ పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించి 50 శాతానికి తగ్గకుండా అమలు చేయాలని, సీపీఎస్ ను రద్దు చేయాలని, 317 జీవో ద్వారా వచ్చిన ఉపాధ్యాయులకు 190 జీవోను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular