మల్లాపూర్, ఆగస్టు 18 (నవగీతం): జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వెంపల్లి గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలను కొనియాడారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పాపన్న గౌడ్ ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, సభ్యులు, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
వెంపల్లిలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
0
35
Next article

