Tuesday, November 3, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ పునర్నిర్మాణానికి విశేష కృషి

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ పునర్నిర్మాణానికి విశేష కృషి

📰 Generate e-Paper Clip

మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, అధ్యక్షుడు మైలారపు రాంబాబుకు సన్మానం

మెట్‌పల్లి, అక్టోబర్ 4 (నవగీతం):

మెట్‌పల్లి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేసి, అనతి కాలంలోనే అత్యధిక విరాళాలు స్వచ్ఛందంగా సమకూరేలా కృషి చేసిన మెట్‌పల్లి పట్టణ మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి ని, అధ్యక్షుడు మైలారపు రాంబాబు ని వాసవి గోల్డ్ స్కిల్ సభ్యులు ఘనంగా అభినందించి సన్మానించారు.

ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణానికి వారు అందిస్తున్న సహకారం, విరాళాల సమీకరణలో చేస్తున్న కృషిని సభ్యులు ప్రశంసించారు. ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో వాసవి గోల్డ్ స్కిల్ సభ్యులు  కోట గంగా జీవన్ చడా చందు, కట్కం రాకేష్   మహాజన్ వెంకటేశ్వర్లు యాంసాని గణేష్  మహాజన్ శివకుమార్  ముత్యపు రమేష్,  మామిడి శ్రీనివాస్ పంపట్టి అమర్నాథ్ దొమ్మటి ప్రవీణ్  తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular