Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలురైతులకు ఆధునిక వరి సాగుపై అవగాహన

రైతులకు ఆధునిక వరి సాగుపై అవగాహన

📰 Generate e-Paper Clip

నవగీతం, ఆర్మూర్

ఆలూర్ మండలం డికంపల్లి గ్రామంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ తడి–పొడి విధానం ద్వారా యాజమాన్యం, నేరుగా వరి విత్తే పద్ధతి, భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం వంటి ఆధునిక సాగు విధానాలను రైతులకు వివరించారు.నూతన సాగు పద్ధతులను అనుసరించడం వల్ల పెట్టుబడి ఖర్చులు తగ్గడమే కాకుండా కూలీల వ్యయం సుమారు రూ.8 వేల వరకు ఆదా అవుతుందని, సాగు సమయం కూడా గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. అలాగే నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నియంత్రించుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని, చీడపీడల నివారణ మరింత సులభతరం అవుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిన్నయ్య, ఉపసర్పంచ్ రాజేందర్, ట్రైనర్ వీరస్వామి సార్, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఏరియా మేనేజర్ సుస్మిత, కమ్యూనిటీ ఫెసిలిటేటర్ మధు, రాజేష్‌తో పాటు లీడ్ ఫార్మర్స్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular