నవగీతం,మెట్ పల్లి
కోరుట్ల నియోజకవర్గ పరిధిలోని ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఉచితంగా ఇన్స్యూరెన్స్ అందిస్తానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రకటించారు.కేటీఆర్ తరహాలో, తన స్వంత ఖర్చులతో నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్లందరికీ ఇన్స్యూరెన్స్ అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.ఆటోలతో పాటు టాటా మ్యాజిక్‌లు, గూడ్స్ వాహనాల డ్రైవర్లకు, అలాగే షాపుల్లో పనిచేసే చిన్న కార్మికులకు కూడా ఇన్స్యూరెన్స్ కల్పిస్తామని స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కోరుట్ల, మెట్‌పల్లి మండలాలతో పాటు కోరుట్ల–మెట్‌పల్లి పట్టణాల్లో పనిచేస్తున్న ఆటో, టాటా మ్యాజిక్, గూడ్స్ ఆటో డ్రైవర్లందరికీ ఇన్స్యూరెన్స్ అందిస్తామని అదేవిధంగా అన్ని షాపుల్లో పనిచేసే కార్మికులకు, ఇతర గ్రామాల నుంచి బైక్‌లపై వచ్చి షాపుల్లో పని చేసే కార్మికులకు కూడా ఇన్స్యూరెన్స్ వర్తింపజేస్తామని చెప్పారు..ఆరోగ్యం బాగాలేక ఇబ్బంది పడుతున్న ఆటో కార్మికులకు కరీంనగర్‌లోని చల్మెడ హాస్పిటల్‌లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని, ఈ సేవలు పూర్తిగా ఫ్రీగా ఉంటాయని వెల్లడించారు.డ్రైవర్లకు ఇన్స్యూరెన్స్‌తో పాటు, వారి కుటుంబ సభ్యులకు కూడా హెల్త్ కార్డులు అందిస్తామని హామీ ఇచ్చారు.అంతేకాకుండా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న ప్రెస్ మిత్రులందరికీ ఉచితంగా ఆక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ అందిస్తామని ప్రకటించడం విశేషం

