Wednesday, April 15, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలగోదాదేవి కళ్యాణానికి రండి..

గోదాదేవి కళ్యాణానికి రండి..

📰 Generate e-Paper Clip

బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘుకు ఆహ్వానం

నవగీతం,మెట్ పల్లి

మెట్ పల్లి మండలం మెట్లచిట్టాపూర్ గ్రామంలో ఈనెల 12న జరిగే గోదాదేవి కల్యాణ మహోత్సవానికి హాజరు కావాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘును శనివారం మెట్లచిట్టాపూర్ గ్రామ సర్పంచ్ సుంకెట గంగాధర్ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. మెట్ పల్లి పట్టణంలోని బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికను అందజేసి కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. కాగా ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మెట్లచిట్టాపూర్ గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన సుంకెట గంగాధర్ ను బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, మెట్ల చిట్టాపూర్  గ్రామ మాజీ సర్పంచ్ బద్ధం శేఖర్, వీడీసీ నాయకులు జనార్ధన్, తేలు శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular