నవగీతం,హైదరాబాద్
అభ్యుదయ సాహితీవేత్త చిరకాల మిత్రుడు ఆచార్య చందు సుబ్బారావు గురువారం ఉదయం మరణించారు. వారి మృతికి తీవ్ర సంతాపం తెలుపుతూ శ్రద్దాంజలి. చందు సుబ్బారావు గొప్ప సాహిత్య విమర్శకుడే గాక అనేక నవలలు రాసిన నవలాకారుడు. అరసం భావాలతో సాహిత్యాన్ని ఎప్పటికప్పుడు మదింపు చేసేవాడు. అభ్యుదయ సాహిత్య ఉద్యమంలో చందు సుబ్బారావు పాత్ర చిరస్మరణీయం అరసం నేత “ఆచార్య చందు సుబ్బారావు” మృతికి అరసం సంతాపం మార్క్సిస్టు రచయిత, అభ్యుదయ రచయితల సంఘంలో ప్రముఖుడు, ఆచార్య చందు సుబ్బారావు కొద్దిసేపటి క్రితం విశాఖపట్నంలో మృతి చెందారన్న వార్త దిగ్భ్రాంతి కలిగించిందని అరసం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, వల్లూరు శివప్రసాద్ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం లో ప్రొఫెసరుగా, మార్క్సిస్టు రచయితగా, భూభౌతిక శాస్త్రవేత్తగా, అభ్యుదయ రచయితల సంఘంలో క్రియాశీలక సభ్యులుగా ఆయన స్త్రీవాద, రాజకీయ మరియు శాస్త్రీయ అంశాలపై అనేక వ్యాసాలు మరియు పుస్తకాలు రచించారని వారు అన్నారు.ఆచార్య చందు సుబ్బారావు మృతిపట్ల అరసం రాష్ట్ర నేతలు ఉప్పల అప్పలరాజు, ఏ ఎమ్ ఆర్ ఆనంద్ సంతాపం తెలిపారు.

