నవగీతం,మెట్ పల్లి
బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కే.ఆర్. సురేష్ రెడ్డి సహకారంతో మెట్‌పల్లి స్వర్ణకార సంఘానికి,కోరుట్ల పట్టణంలోని 9వ వార్డులో గల పీరీల మసీదు కి, అలాగే కోరుట్ల 28వ వార్డులో గల పోచమ్మ దేవాలయానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ పత్రాలు మొత్తం రూ.5,50,000/- విలువగల ప్రొసీడింగ్స్ ను ఎమ్మెల్యే సంజయ్ అందచేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ, తాను ఎమ్మెల్యేగా గెలిచి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా నియోజకవర్గానికి అందలేదని అన్నారు.అయినప్పటికీ బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుల సహకారంతో నియోజకవర్గానికి అవసరమైన నిధులను తీసుకువచ్చి ప్రజలకు సేవలందిస్తున్నామని తెలిపారు. ఈ నిధుల మంజూరుకు సహకరించిన బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కే.ఆర్. సురేష్ రెడ్డి కి ఎమ్మెల్యే సంజయ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

