Thursday, April 16, 2026
ads
Homeఎడిటోరియల్ఘనంగా జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు

ఘనంగా జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు

📰 Generate e-Paper Clip

నవగీతం,మల్లాపూర్

స్వామి వివేకానంద జయంతి – నేషనల్ యూత్ డే సందర్భంగా గుండంపల్లి గ్రామంలో సర్పంచ్ డప్పుల పద్మ నరసయ్య ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ఘనంగా నిర్వహించారు.ఈ పోటీల్లో దాదాపు 30 టీములు పాల్గొన్నారు. విన్నర్స్ గా జగిత్యాల టీం,రన్నర్స్ గా గుండంపల్లి టీం గెలుపొందారు. విజేతలకు బహుమతులు అందజేసి యువతను ప్రోత్సహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ యువతే దేశ భవిష్యత్ – స్వామి వివేకానంద ఆశయాలకు అనుగుణంగా యువతను ముందుండి నడిపించి క్రీడల ద్వారా ప్రోత్సాహం కలిగించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కిషన్ సెల్ అధ్యక్షులు ఎల్లాల జలపతి రెడ్డి ,మండల మార్కెట్ చైర్మన్ అంతర్పుల నరసయ్య – పుష్పలత , సిర్పూర్ మాజీ సర్పంచ్ బాపు రెడ్డి, సిర్పూర్ గ్రామ ఉపసర్పంచ్ నాగార్జున రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ నత్తి రాము , గొర్రెపెల్లి సర్పంచ్ వెంకట్ రెడ్డి ,నాయకులు రాజు, సంజీవ్, నాగరాజు, గ్రామ ప్రజలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular