జిల్లా అధ్యక్షులు గొల్లే రాజ్‌కుమార్
నవగీతం,పెద్దపల్లి
నేతకాని సమాజం రాజకీయంగా ఎదిగి,నిర్ణయాత్మక శక్తిగా మారినప్పుడే ఆ సామాజికవర్గ ఉనికి చాటుకోగలమని నేతకాని కుల సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గొల్లే రాజ్‌కుమార్ స్పష్టం చేశారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో జిల్లా అద్యక్షుడు రాజ్‌కుమార్ మాట్లాడుతూ రాబోయే మున్సిపల్,ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ ఎన్నికలను నేతకాని కులస్థులు ఒక అవకాశంగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు.ఏ పార్టీ నుంచైనా బి-ఫామ్ పొంది వార్డుల్లో పోటీకి సిద్ధమయ్యే అభ్యర్థులకు జిల్లా కమిటీతో పాటు కుల సంఘం పెద్దలందరూ వెన్నుదన్నుగా నిలుస్తారని భరోసా ఇచ్చారు.రాజకీయ అధికారం అనేది ప్రజలకు సేవ చేయడానికి ఒక గొడుగులా ఉపయోగపడుతుంది అన్న అంబేద్కర్ మాటలను స్ఫూర్తిగా తీసుకుని, కుల బాంధవులు ఐక్యమత్యంతో రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెట్టాలని కోరారు. ఐక్యమత్యమే మహాబలమని,అందరం కలిసికట్టుగా పోరాడితేనే అద్భుతమైన ఫలితాలు సాధించగలమని పేర్కొన్న ఆయన,నేతకాని జాతంతా అభ్యర్థుల వెంటే ఉండి ప్రోత్సహిస్తుందని తెలిపాలు.ఈ కార్యక్రమంలో నేతకాని కుల సంఘం నాయకులు బౌతు గంగాజలం,మాదాసు సుదాకర్,గోల్లే మల్లయ్య,గొల్లే సారయ్య తదితరులు పాల్గోన్నారు.

