నవగీతం, మల్లాపూర్
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మంగళవారం మల్లాపూర్ మండల కేంద్రంలో మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మహా చండీ హోమం నిర్వహించినారు. ఐదు హోమ గుండాలలో దాదాపు 50 జంటలు సతి సమేతంగా చండీ హోమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సోమ అశ్విన్ కుమార్ చేతుల మీదుగా నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో నూనె శ్రీనివాస్, చౌడారపు శ్రీనివాస్, నూనె అంజనేయులు, మైలారపు నరేష్, శివరామ కిషన్ గుప్తా,చిం శశిధర్, కంటాల భూమయ్య, తదితరులు పాల్గొన్నారు.

