Thursday, April 16, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలమండల నాయి బ్రాహ్మణ కార్యవర్గం ఏకగ్రీవం

మండల నాయి బ్రాహ్మణ కార్యవర్గం ఏకగ్రీవం

📰 Generate e-Paper Clip

నవగీతం,మల్లాపూర్

మల్లాపూర్ మండల కేంద్రంలో నాయి బ్రాహ్మణ(మంగలి) సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సంఘ సమావేశంలో సంఘ మండల కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా వాల్గొండ గ్రామానికి చెందిన జకినపల్లి రాములు, ఉపాధ్యక్షులు గా పెండపు జగదీష్ , ప్రధాన కార్యదర్శి ముత్యాల నరసయ్య , కోశాధికారిగా ప్రమోద్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘ సభ్యులందరికీ రుణపడి ఉంటాను అని మన సంఘ అభివృద్ధికి సంఘ కట్టుబాట్లను పాటిస్తూ అందరికీ సేవ చేస్తానని సంఘాన్ని ముందుకు తీసుకెళ్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో మంగలి రాములు, హరీష్ ,నర్సయ్య మాజీ అధ్యక్షులు కార్యదర్శులు మల్లాపూర్ మండల  కుల సంఘ పెద్దలు సభ్యులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular