– జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
నవగీతం,జగిత్యాల ప్రతినిధి:
సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సోషల్ జస్టిస్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం జరిగేల పలు అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు అమలు చేయడం తో పాటు ఫిబ్రవరి 4, నాడు సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. సోషల్ జస్టిస్ డే సందర్భంగా ప్రభుత్వం వివిధ సామాజిక వర్గాల అభివృద్ధికి అనేక రకాల సంక్షేమ పథకాలను అమలుపరుస్తుందని తెలిపారు.

మహనీయులు, పెద్దలు సూచించిన విధంగా సమసమాజ స్థాపనకు అందరు కలిసి కట్టుగా కృషి చేయాలని తెలిపారు. సమాజంలో ప్రతిఒక్కరు రాజ్యాంగ పరంగా మరియు చట్ట పరంగా లభించే హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సామజిక న్యాయం ద్వారా సమానత్వం, సమాన అవకాశాలు, గౌరవ ప్రదమైన జీవనం సాధ్యమౌతాయని తెలిపారు. అనంతరం సోషల్ జస్టిస్ డే సందర్బంగా జిల్లా కలెక్టర్ అందరిచేత ప్రతిజ్ఞ చేయించారు. తదనంతరం వివిధ పోటిల్లో పాల్గొని ప్రతిభ చూపిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. విద్యార్థుల ప్రదర్శన, కళాజాత బృందం ప్రదర్శన అందరిని అలరించాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, కలెక్టరేట్ సిబ్బంది పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బిఎస్ లత, బి. రాజ గౌడ్, బీసీ వెల్ఫేర్ అధికారి జి. సునీత, మైనార్టీ అభివృద్ధి అధికారి చిత్రు, జిల్లా ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి అధికారి కె. రాజ్ కుమార్, జిల్లా విద్యాధికారి కె. రాము, వివిధ స్థాయిల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో హకిమ్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

