Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలసైకత శిల్ప ప్రతిష్టారాధనకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

సైకత శిల్ప ప్రతిష్టారాధనకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

📰 Generate e-Paper Clip

ఆహ్వాన పత్రికను అందించిన నిర్వాహకులు ఉమారాణి

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

కలియుగ వెంకటేశ్వర స్వామి 20 అడుగుల సైకత ఇసుక శిల్ప ప్రతిష్టారాధన కార్యక్రమానికి రావాల్సిందిగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్. ఎం.సంజయ్ కుమార్ ను నిర్వాహకులు ఉమారాణి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈనెల 5 నుండి మార్చి 5 వరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో ని ఎగ్జీభిషన్ గ్రౌండ్ లో నెలకొల్పే సైకత ఇసుక శిల్ప ఆరాధన కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు వేముల ఉమారాణి తెలిపారు. కార్యక్రమ ప్రధాన ఆర్గనైజర్ వేముల ఉమారాణి బుధవారం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసి 3డి సైకత ఇసుక శిల్ప ప్రతిష్టారాధన కార్యక్రమానికి రావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. అలాగే ప్రముఖ వ్యాపారావేత్త, బీజేపీ నాయకులు కొండా లక్ష్మణ్ ఇంటికి వెళ్లిన ఉమారాణి, కొండ్ర రమాదేవి లు ఆహ్వానపత్రిక అందించి ప్రతిష్టారాధనకు రావాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular