నవగీతం,చొప్పదండి:
చొప్పదండి పురపాలక సంఘం ఎన్నికలలో భాగంగా 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరచిన ముద్దం రాజేశ్వరి తిరుపతి గౌడ్ కి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించిన చొప్పదండి శాసనసభ్యులు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ జోడు గుర్రాళ్ల పరుగులు పెడుతున్నాయని, కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థులకు ఓటేసి చొప్పదండి పట్టణాన్ని అభివృద్ధి చేసే అవకాశం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

