Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలకస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

📰 Generate e-Paper Clip

నవగీతం,మల్లాపూర్:

మల్లాపూర్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను జిల్లా అడిషనల్ కలెక్టర్  బి.ఎస్. లత ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్నం భోజనం నాణ్యతను పరిశీలించి మెనూ ప్రకారం సకలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని వారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు అనంతరం విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు, అలాగే తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లి పలు రికార్డులను పరిశీలించారు.

విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న అదనపు కలెక్టర్

నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యలపై ప్రతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మీసేవ సర్టిఫికెట్లను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమములో తహశీల్దార్, గిర్దవార్ పాఠశాల ఉపాధ్యాయురాలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular