Thursday, February 26, 2026
ads
Homeఇల్లంతకుంటగ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం

గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం

📰 Generate e-Paper Clip

నవగీతం,ఇల్లంతకుంట :

ఇల్లంతకుంట మండలంలోని అన్ని గ్రామాలకు రహదారులకు అనుసంధానం చేస్తూ ,వాటిని చదును చేసి వాహనదారులకు మంచి రహదారులను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు , సర్పంచ్ కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. మండలంలోని ముస్కాన్ పేట- తాళ్లపల్లి గ్రామాల మధ్య ఉన్న రహదారిని ఉపాధి హామీ ద్వారా వేసేందుకు పనులను ప్రారంభించారు. రెండు గ్రామాల మధ్య రాకపోకలు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఉపాధి హామీ ద్వారా చదును చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్ల పెల్లి గ్రామ సర్పంచ్ సింగిరెడ్డి రచన వెంకట్రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు , ఉపసర్పంచ్ ఎలుక రామస్వామి,ఏఎంసి డైరెక్టర్ సుధగోని తిరుపతి గౌడ్, వార్డు సభ్యులు బోడ కమలాకర్ రెడ్డి, పల్లె తిరుపతి రెడ్డి ,సింగిరెడ్డి మహేందర్ రెడ్డి, బొల్లావేణి కుంటయ్యా, కాటేపెల్లి వెంకరెడ్డి ,సామా భాగ్య రెడ్డి, సుధగోని రాములు, జుట్టునర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular