Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణఖమ్మంమున్సిపల్ చైర్మన్ దంపతులకు ఘన సత్కారం

మున్సిపల్ చైర్మన్ దంపతులకు ఘన సత్కారం

📰 Generate e-Paper Clip

నవగీతం,వైరా ప్రతినిధి:

వైరా మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ ను తెలుగుదేశం పార్టీ బుధవారం ఘనంగా సత్కరించారు. టిడిపి కార్యాలయంలో చైర్ పర్సన్ లయన్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కాపా మురళీ కృష్ణ చంద్రకళను ఆ పార్టీ సత్కరించింది. అనంతరం డాక్టర్ కాపా చంద్రకళ మాట్లాడుతూ మున్సిపాలిటీలో పారదర్శకమైన పాలనకు శాయశక్తులా కృషి చేస్తానని తెలుగు దేశం పార్టీ అందుకు సహకరించి సూచనలు, సలహాలు అందించాలని కోరారు. 6వ వార్డులో కాంగ్రెస్, టిడిపి పార్టీలతో సహా అభిమానులు అందించిన సంపూర్ణ మద్దతు మరువలేనిదన్నారు. తమ కార్యాలయానికి ఆహ్వానించి సన్మానించి నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కాపా మురళీ కృష్ణ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ, మాజీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, తెలుగుదేశం పార్టీ వైరా నియోజక వర్గ ఇంచార్జి చెరుకూరి చలపతి రావు, మండల, పట్టణ అధ్యక్షులు కిలారు సురేంద్ర, బొల్లేపల్లి శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు మందడపు మధుసూదన్ రావు, మోత్కూరు వెంకటేశ్వరరావు, మద్దినేని రామారావు, బోడేపూడి మురళీ, లయన్స్ క్లబ్ సభ్యులు తోటకూర శ్రీకాంత్, లగడపాటి ప్రభాకర్ రావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular