ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొప్పదండి
మున్సిపల్ కు అత్యధిక నిధులు తీసుకువచ్చి చొప్పదండి మున్సిపల్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీ గా తీర్చిదిద్దుతానని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. చొప్పదండి పట్టణంలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు.

చొప్పదండి పట్టణంలో మినీ స్టేడియం నిర్మాణానికి, కుడి చెరువు మినీ ట్యాంక్ బండ్ గా తీర్చి దిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు. గుమ్లాపూర్ లో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సభలో చొప్పదండి మున్సిపల్ అభివృద్ధికి కావలసిన పనుల వివరాల జాబితాను ముఖ్యమంత్రికి అందజేశానని, చొప్పదండిని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని పేర్కొన్నారు .11 వ తేదీన జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరికీ ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

