Thursday, April 16, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఅక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ ఓనర్ , డ్రైవర్ పై కేసు నమోదు

అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ ఓనర్ , డ్రైవర్ పై కేసు నమోదు

📰 Generate e-Paper Clip

అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు

నవగీతం,జగిత్యాల ప్రతినిది:

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన భూక్య వంశీ (24) తన యజమాని అయిన అదే గ్రామానికి చెందిన ఇస్లావత్ శంకర్ ఆదేశాల మేరకు వేంపల్లి గ్రామ శివారులోని గోదావరి నది నుండి ఇసుకను తీసుకొని వస్తున్న లారీ నెం.TS 06 UC 6588 సోమవారం రోజున ఏలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా ఉదయం సుమారు 07:00 గం.ల సమయంలో ఇబ్రహీంపట్నం గ్రామంలోని ఇందిరా గాంధీ చౌరస్తా వద్ద లారీని పట్టుకున్నట్లుగా ఇబ్రహీంపట్నం గ్రామ జిపిఓ సుంకం తిరుపతి ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ భూక్య వంశీ, లారీ యజమాని ఇస్లావత్ శంకర్ వారిద్దరిపై కేసు నమోదు చేసామని, ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇబ్రహీంపట్నం ఎస్సై జి నవీన్ కుమార్ హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular