Thursday, February 26, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలజగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ల లొల్లి...జీవన్ రెడ్డి వర్గంలో అసంతృప్తి

జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ల లొల్లి…జీవన్ రెడ్డి వర్గంలో అసంతృప్తి

📰 Generate e-Paper Clip

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపై అసంతృప్తితో జీవన్ రెడ్డి నివాసం ముందు బూతులు తిడుతూ రెచ్చిపోయిన ఆశావహులు. మొత్తం 50 సీట్లలో ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి 30 సీట్లు, సీనియర్ నేత జీవన్ రెడ్డి వర్గానికి కేవలం 20 సీట్లు కేటాయించడంపై జీవన్ రెడ్డి వర్గీయులు తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు. కండువా మోసిన ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు బీ-ఫారమ్‌లు ఇవ్వకుండా, పార్టీ మారిన వారికి ఇచ్చారని జీవన్ రెడ్డి నివాసం వద్ద కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సంజయ్ తమ కడుపు కొట్టాడని ఆరోపించిన ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు, అవసరమైతే ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. టికెట్ల వివాదం నేపథ్యంలో ఎమ్మెల్యే సంజయ్ క్యాంపు కార్యాలయం, ఆయన నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular